Keerthi suresh | దసరా సెట్లో పశువులతో కీర్తి సురేష్ దోస్తీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు
Dasara Movie | 'మహానటి' సినిమాతో టాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది మలయాళి బ్యూటీ కీర్తి సురేష్. ఈ సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును సైతం గెలుచుకుంది. ఇక ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తో కీర్తికు తెలుగులో ఆఫర్ల వరద పోటెత్తింది.
Dasara Movie | ‘మహానటి’ సినిమాతో టాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది మలయాళి బ్యూటీ కీర్తి సురేష్. ఈ సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు సైతం గెలుచుకుంది. ఇక ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తో కీర్తికు తెలుగులో ఆఫర్ల వరద పోటెత్తింది. కీర్తి కూడా ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏమి ఆలోచించకుండా సినిమాలు చేసింది. దాంతో అవి కాస్త ఫ్లాపులుగా మారి కీర్తి ఇమేజ్ను పూర్తిగా డ్యామేజ్ చేశాయి. ఒకనొక సందర్భంలో కీర్తి సినిమాలెందుకు చేస్తుంది అనే భావన కూడా ప్రేక్షకుల్లో కలిగింది. అయితే ‘సర్కారు వారి పాట’ సినిమాతో మళ్లీ ఈ అమ్మడు హిట్ ట్రాక్ ఎక్కింది. గతేడాది నేరుగా ఓటీటీలో రిలీజైన ‘చిన్ని’ సినిమాకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.
ప్రస్తుతం ఈ కుట్టి నటించిన ‘దసరా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. సినిమాకు ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చిన వంద కోట్ల బొమ్మ అవడం ఖాయం అనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం అటు ప్రమోషన్లు, ఇటు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ జానాల్లోకి సినిమాను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కీర్తి దసరా సెట్లో గేదెలతో, మేకపిల్లతో, కోడితో ఎంజాయ్ చేసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కీర్తికు పశువులంటే ఎంత ఇష్టమో, వాటితో ఎంత చనువుగా ఉంటుందో వీడియో చూస్తే స్పష్టం అవుతుంది. అని వీడియోతో ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో కీర్తి డీ గ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లలో అచ్చు పల్లెటూరి అమ్మాయిలా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలలో కీర్తి వెన్నెల పాత్రలో నటించింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమా గురువారం పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలన్ని ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసాయి. మ్యూజికల్‌గా కూడా ఈ సినిమాకు విపరీతమైన బజ్ వచ్చింది. ఇక గతంలో నాని-కీర్తి కాంబోలో వచ్చిన నేను లోకల్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు కూడా దసరా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని చిత్రయూనిట్ ధీమాగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

