Rahul Gandhi | న్యూఢిల్లీ, మార్చి 24: ఎంపీ పదవికి అనర్హత గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని తన అధికార బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ కేసుకు సంబంధించి నెలరోజుల్లో ఉన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి ఉపశమనం రాకపోతే రాహుల్ తప్పక తన నివాసాన్ని ఖాళీ చేయాల్సిందేనని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
2004లో లోక్సభ ఎంపీగా ఎన్నికైన అనంతరం రాహుల్ గాంధీకి తుగ్లక్ వీధిలోని 12 నంబర్ బంగ్లాను కేటాయించారు. అయితే ఇప్పుడు అనర్హతకు గురైనందున ప్రభుత్వ నివాస గృహంలో ఉండటానికి అర్హుడు కాడని ఆ అధికారి వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనర్హత పొందిన తేదీ నుంచి నెల రోజుల్లో తన నివాస భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.