Mamata Banerjee | బాంబే హైకోర్టులో మమతాబెనర్జికి చుక్కెదురు.. ‘జాతీయ గీతం’ కేసులో లభించని ఊరట
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తాను జాతీయ గీతాన్ని అగౌరవపర్చానంటూ దాఖలైన పిటిషన్‌ను రద్దు చేయాలంటూ మమతాబెనర్జి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
ముంబై: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తాను జాతీయ గీతాన్ని అగౌరవపర్చానంటూ దాఖలైన పిటిషన్‌ను రద్దు చేయాలంటూ మమతాబెనర్జి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2021, డిసెంబర్లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతాబెనర్జి జాతీయ గీతాన్ని అగౌరవపర్చారంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో తాను నేరం చేయలేదని, ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని మమతాబెనర్జి అప్పీల్ చేశారు. ఆ అప్పీల్‌ను తాజాగా కోర్టు తోసిపుచ్చింది.
2021లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవపర్చినందుకు మమతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఓ బీజేపీ నేత మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. మమత ముంబై పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఆమె లేచి నిలిబడలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మమత జాతీయగీతాన్ని అవమానించారని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కోర్టుకు సమర్పించాడు. అనంతరం ఈ అంశం బాంబే హైకోర్టుకు చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

