TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్‌ను ఆమె ఇంట్లోనే హత్య చేశారు. రావల్పిండిలో తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి అనుమానిత ఆయుధాన్ని సీజ్ చేశారు.
రావల్పిండి: పాకిస్థాన్‌కు చెందిన ఓ టీవీ యాంకర్(TV Anchor) రాబియాను ఆమె ఇంట్లోనే హత్య చేశారు. రావల్పిండిలో తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి అనుమానిత ఆయుధాన్ని సీజ్ చేశారు. స్థానిక ప్రైవేటు టీవీ ఛానల్లో యాంకర్‌గా, ప్రోగ్రామ్ హోస్ట్‌గా రాబియా అహసాన్ పనిచేస్తున్నది. నగరంలోని గుల్షానాబాద్ ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఆమె శవమై తేలింది. ఈకేసులో అహసాన్ భర్తను అదుపులోకి తీసుకున్నట్లు సిటీ పోలీసు ఆఫీసర్ హసన్ ముస్తాక్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రమాదవశాత్తు తుపాకీ పేలినట్లు ఆ ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి తెలిపారు. క్రైం జరిగిన ప్రదేశం నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. పోస్టు మార్టమ్ నిమిత్తం బాడీని ఆస్పత్రికి తరలించారు. టీవీ యాంకర్ మృతి పట్ల ఫస్ట్ లేడీ అసీఫా భుట్టో జర్దారి సంతాపం తెలిపారు. హింసను ఆమె ఖండించారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రావల్పిండిలోనే ఇటీవల 45 ఏళ్ల డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ హీనా జావెద్‌ను హత్య చేసిన అంశాన్ని గుర్తు చేస్తూ భుట్టో ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

