Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి ప్రస్తుతం చాలామంది క్రాస్‌ఫిట్ వైపు మొగ్గు చూపుతున్నారు. 2001లో ప్రారంభమైన ఈ వ్యాయామ విధానం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. క్రాస్‌ఫిట్ అంటే నిరంతరం మారే వ్యాయామాలు, రోజువారీ జీవితానికి ఉపయోగపడే శరీర కదలికలు, అధిక తీవ్రతతో చేసే సాధన అని అర్థం.
Crossfit | శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి ప్రస్తుతం చాలామంది క్రాస్‌ఫిట్ వైపు మొగ్గు చూపుతున్నారు. 2001లో ప్రారంభమైన ఈ వ్యాయామ విధానం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. క్రాస్‌ఫిట్ అంటే నిరంతరం మారే వ్యాయామాలు, రోజువారీ జీవితానికి ఉపయోగపడే శరీర కదలికలు, అధిక తీవ్రతతో చేసే సాధన అని అర్థం. సాధారణ వ్యాయామశాలల్లో ఒకే విధమైన దినచర్యను అనుసరిస్తారు. సోమవారం ఛాతీ, చేతులు, మంగళవారం వీపు, బుధవారం కాళ్లు, మరో రోజు నడక లేదా ఇతర గుండె సంబంధిత వ్యాయామాలు చేస్తుంటారు. కానీ క్రాస్ఫిట్లో ప్రతిరోజూ వ్యాయామాల రకం, వాటి సంఖ్య, సమయం, ఉపయోగించే పరికరాలు మారుతుంటాయి. వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, పరుగులు వంటి పలు సాధనలను కలిపి చేస్తారు. దీనివల్ల శరీరం వివిధ రకాల సవాళ్లను ఎదుర్కొనేలా తయారవుతుంది. కేవలం బరువులు ఎత్తడంలోనో, ఎక్కువ దూరం పరుగెత్తడంలోనో నైపుణ్యం పెంచుకోవడం కాకుండా అన్ని రకాల శారీరక సామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చు.
రోజువారీ సహజ కదలికలకు ప్రాధాన్యం..
క్రాస్ఫిట్లో రోజువారీ జీవితంలో మనం చేసే సహజ కదలికలకు ప్రాధాన్యం ఇస్తారు. పరుగెత్తడం, దూకడం, బరువులు లాగడం, తోయడం, కూర్చోవడం, వంగడం, మోకాళ్లు వంచడం, వస్తువులను మోయడం వంటి కదలికలు ఇందులో ఉంటాయి. వీటిని శరీర బరువుతో లేదా బార్బెల్స్, కెటిల్‌బెల్స్, డంబెల్స్ వంటి పరికరాల సాయంతో చేస్తారు. సాధారణ వ్యాయామశాలల్లో కొన్ని యంత్రాలు నిర్దిష్ట కండరాలపై మాత్రమే పనిచేస్తాయి. కానీ రోజువారీ పనులు చేసేటప్పుడు ఒకేసారి అనేక కండరాలు, కీళ్లు పనిచేస్తాయి. ఉదాహరణకు నేలపై ఉన్న చిన్నారిని ఎత్తుకోవడం, కారు నడపడం వంటి పనుల్లో శరీరంలోని పలు భాగాలు సమన్వయంతో కదులుతాయి. క్రాస్‌ఫిట్ ఈ తరహా కదలికలకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
అధిక తీవ్రత అంటే..
తక్కువ సమయంలో ఎక్కువ శ్రమతో వ్యాయామం చేయడాన్ని అధిక తీవ్రత అంటారు. ఉదాహరణకు పది గంటల్లో 100 పుష్అప్స్ చేయడం సులభమే. అదే మూడు నిమిషాల్లో చేయాలంటే ఎక్కువ శ్రమ అవసరం. అయితే ఈ తీవ్రత అందరికీ ఒకేలా ఉండదు. వయసు, గత వ్యాయామ అనుభవం, శారీరక సామర్థ్యాన్ని బట్టి మారుతుంది. సరైన పద్ధతిలో కదలికలు చేయడం అలవడిన తర్వాతే తీవ్రతను పెంచాలని నిపుణులు సూచిస్తారు. క్రాస్‌ఫిట్ వల్ల కండరాల బలం, శారీరక ఓర్పు, ఎముకల సాంద్రత, జీవక్రియ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
శిక్షకుల పర్యవేక్షణ అవసరం..
ఈ వ్యాయామం యువతకే పరిమితం కాదు. 24 ఏళ్ల క్రీడాకారుడు, 76 ఏళ్ల వృద్ధురాలు ఒకే తరహా వ్యాయామం చేసినా, వారి వయసు, సామర్థ్యానికి అనుగుణంగా బరువులు, తీవ్రతను మార్చుకోవచ్చు. ఉదాహరణకు 60 కిలోల బరువుతో చేసే వ్యాయామాన్ని వృద్ధురాలు తక్కువ బరువున్న డంబెల్స్‌తో చేయవచ్చు. ఇలా ప్రతి ఒక్కరూ తమ శారీరక స్థాయికి తగ్గట్టు సాధన చేయవచ్చు. కాబట్టి క్రాస్‌ఫిట్ ప్రారంభించాలనుకునేవారు శిక్షకుల పర్యవేక్షణలో సరైన పద్ధతులు నేర్చుకుని, క్రమంగా తీవ్రతను పెంచుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

