అప్పుడే విచ్చుకొన్న
ఆకుపచ్చని కుదుళ్లలో
మంచు బిందువుల లయలు,
హంగుల ఆకృతులు ఆవిష్కృతమవుతూ
ఆకాశం అద్భుత వన్నెల్ని చిలకరిస్తోంది
జానపద లయల్లో
ఓలలాడిన పచ్చని మాగాణికి
కొత్త హంగులేవో అబ్బినట్టు
తన్మయత్వ
పద్దెనిమిదేళ్ల వయస్సులో
ప్రణయభావాలతో ఊహల్లో విహరించకుండా
వేదనాభరితమైన తన కవితాక్షరాలను
బాధల పలకపై దిద్దుకుంటూ..
‘ఎల్లలు లేని కవితాకాశంలో
ఎవరెవరి బాధలైనా రాస్తా,
క్షమించండి నా ఒక్కడివి మాత్రం దాస్తా�
ఉత్కంఠమైన కాలం
కరిగిపోతున్నది
కాలగర్భంలో కలిసిపోతున్నది
కుంచించుకు పోతున్న
మెదళ్ల మొదళ్ల మధ్య
అగ్గి రాజేస్తూ..
సమయం సచ్చీలంగానే
బాధల బంతిని
వేగంగా బౌండరీకి గిరాటు కొట్టింది
ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్
ఆధునిక సాహిత్యం విభిన్న రీతులు సంతరించుకుంటూ నూతనత్వాన్ని సొంతం చేసుకుంటున్నది. శైలి, నిర్మాణ పరంగా ఎప్పటికప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతూ, అనేక పేర్లతో, విధానాలతో నవీన సాహిత్యం తన వర్గప్రయోజనం దిశగా అ�
ఒకదానినొకటి చూస్తూ కూచున్న
కుర్చీ బల్లా ముందు
ఆలోచనలు నేలపైకి జారుతున్నాయి
ఒళ్లు తెలియక నృత్యంచేస్తున్న దుమ్ము కణాల ముందు
నలుదిక్కులూ తిరిగి ఎటూ పాలుపోక
సమయం ఆ కుర్చీలో కూలబడింది
భూమి చలాకి పిల్లలా గుండ్రంగా తిరుగుతూ
రాత్రి పగలు ఆడుకుంటోంది !
నిద్ర మాట ఎరుగదు !!
వర్షంలో నానుతూ నానుతూ
పచ్చపచ్చగా సింగారించుకొని
భూమి పూలు పూలుగా భ్రమణం !
అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడల్లా,
నీళ్లు చెమర్చిన కళ్లతోనే చిరునవ్వును చిందిస్తుంటా..
గతకాలపు స్మృతులన్నీ గాజు తెరపై ప్రత్యక్షమై,
ఒకప్పటి నన్ను గుర్తుచేసినప్పుడల్లా
కోల్పోయిన క్షణాలకై కుమిలిపో�