జలపాతాల కోసం ఎక్కడికీ వెళ్లక్కర్లేదు తమ లేత వీపులపై పుస్తకాల భారం మోయలేనిలేగదూడల కళ్లల్లోకి చూస్తే చాలు
అయ్యో&అంతలా ఉన్న ఆ గంధపుచెక్కను ఇంతలా అరగ దీశారేం?అది ఈ పేదింటికి మంచి పెద్ద కొడుకండీ
కవిత్వం తనకు తిండి పెట్టిన ఆలోచనలు తలచుకుని విశ్వాసంగా తోక ఊపుతోంది
రచయితను నిద్రపోనివ్వని వెతల నాగస్వరం చూసి కథ పడగలా విచ్చుకుంది
పూజగదిలో వెలిగించే అగరొత్తులు చూస్తుంటే సన్నని పీల పేదలు మనకు పరిమళం పంచేందుకుతమ బతుకులు
త్యాగం చేస్తున్నట్లుంది!
నలిమెల భాస్కర్