బాలరాముని సదనాన బలగమంత
జేరి ఉయ్యాల కట్టేరు చెంపగిల్లి
ముద్దు పెట్టేరు ముదముగా పడతులంత
రామ రామంటు సీతమ్మ రాగమీడె
ముద్దులొలుకేడివాని ముద్దు ముఖము
చందమామలా వెలిగేను చక్కగాను
చూసినంతనే శుభమగు చూడరండి
కలుగు పుణ్యఫలములన్ని కంటిముందు
బారసాలను చేసేరు భామలంత
పిండి వంటలు చేసేరు తిండి కొరకు
బాలరాముని సేవకై బారుతీరి
రండి పండుగ సందడి కండి మీరు