అప్పుడే విచ్చుకొన్న
ఆకుపచ్చని కుదుళ్లలో
మంచు బిందువుల లయలు,
హంగుల ఆకృతులు ఆవిష్కృతమవుతూ
ఆకాశం అద్భుత వన్నెల్ని చిలకరిస్తోంది
జానపద లయల్లో
ఓలలాడిన పచ్చని మాగాణికి
కొత్త హంగులేవో అబ్బినట్టు
తన్మయత్వపు తుషార సింధువులా
ఆశల మేఘమై తబ్బుబ్బి
విను వీధుల్లో వీర విహారం సాగిస్తోంది
కొన్నాళ్ల ముచ్చటైనా…,
కొండా, కోనా.., ఊరూ, వాగూ…
తుళ్లింతల తూనీగలా
తొలిపొద్దును మోసుకొస్తోంది
చలి గిలిగింతలు ఎన్నున్నా…
వెన్నెల వైపు మది పరిగెడుతోంది
మంచు అంటే
నాలుగు చుక్కల
బిందువు కాదు
చెట్టు, చిగురుకూ..
మనిషికీ, మనసుకూ..
నేలకూ, నింగికీ..,
అదొక ఆత్మీయ ఆలింగనం
మంచు బిందువుల సమ్మేళనం
ఉషోదయానికి ముందే
మంచు తెరల రాకతో
ఊరొక్క ఉషస్సుల సంగమం
చెట్టూ, చేల పులకింతల
సంగీతం
చూసి తరించే కళ్లకు
అద్భుతాలను ఆవిష్కరించే
హంగుల హిమదీపం..!
– మహబూబ్ బాషా చిల్లెం 95020 00415