రామనామ మహిమ రమ్యమైనుండును
రామ భజన జేయ రగులు భక్తి
భక్తిలేని బ్రతుకు ముక్తి దరికి పోదు
భక్తపారిజాత బాలరామ
రామ గుణము నేర్వ రాజిల్లు జన్మము
రామబాట నడువ రాదు బాధ
రామ బాట వల్ల రామ రాజ్యమువచ్చు
భక్తపారిజాత బాలరామ
తల్లితండ్రి సేవ తనయుడు రాముడు
జేసినాడు నెపుడు చేతులార
జనని జనకులన్న జగతిలో దేవుళ్లు
భక్తపారిజాత బాలరామ
జాదవ్ పుండలిక్రావు పాటిల్
94413 33315