ఫేస్బుక్లో ప్రేమతో పలుకరించారు నైజీరియన్ సైబర్‌నేరగాళ్లు. ప్రేమకు గుర్తుగా నీకు బహుమతి పంపిస్తున్నానంటూ నమ్మించారు. మహేశ్ బ్యాంక్ సైబర్ దోపిడీ డబ్బులను ఆమె ఖాతాలోకి బదిలీ చేశారు.
హైదరాబాద్ జిల్లాలోని రజకుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, వారికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు.
శంషాబాద్ మం డలం నర్కూడ అమ్మపల్లి ఆలయంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఆర్టీసీ ఉద్యోగులు పనిచేసే స్థలంలో తప్పనిసరిగా బూస్టర్ డోసు వేయించుకోవాలని రంగారెడ్డి జిల్లా ఇమ్యూనిటైజేషన్ అధికారి స్వర్ణకుమారి సూచించారు.
మండలం పరిధిలోని గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వర దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం గురువారం నుంచి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఖైరతాబాద్‌లో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక తుదిదశకు చేరింది. నియోజకవర్గంలో దాదాపు 150 మంది దళితబంధు కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో అర్హులను గుర్తించే పనిలో అధికారులు పడ్డారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి 70వ జన్మదిన వేడుకలను మంగళవారం రెడ్‌హిల్స్ నఫీజ్ రెసిడెన్సీలోని రమణాచారి క్యాంపు కార్యాలయంలో సాహితీవేత్తలు, కళాకారుల మధ్య ఘనంగా నిర్వహించారు.