హయత్‌నగర్, ఫిబ్రవరి 8: హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సారా శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో పలువురు కాలనీవాసులు కలిసి వినతిపత్రం అందజేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాలనీలో నూతనంగా ఇంటర్ పోల్స్, హైమాస్టు లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. దొంగల బెడద అధికమవుతున్నందున కాలనీలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కాలనీవాసులు వనం అశోక్, కట్కూరి బాలకిషన్, ఈసం శంకర్, పగడాల నరసింహ, కొమ్మగోని శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.