పార్కులను అభివృద్ధి చేయాలి
సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ డబుల్ బెడ్ర్రూం ఇండ్ల కాలనీలో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పార్కులను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బన్సీలాల్‌పేట డివిజన్లోని ఐడీహెచ్ డబుల్ బెడ్ర్రూం కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలను కమిషనర్ మంగళవారం జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హౌసింగ్ ఎండీ గౌతమ్‌తో కలిసి పర్యటించారు.
- జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్
సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ : సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ డబుల్ బెడ్ర్రూం ఇండ్ల కాలనీలో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పార్కులను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బన్సీలాల్‌పేట డివిజన్లోని ఐడీహెచ్ డబుల్ బెడ్ర్రూం కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలను కమిషనర్ మంగళవారం జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హౌసింగ్ ఎండీ గౌతమ్‌తో కలిసి పర్యటించారు. కాలనీల్లో ఉన్న రెండు ఖాళీ స్థలాల్లో పిల్లల పార్కులను అభివృద్ధి చేయాలని సికింద్రాబాద్ జోనల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మంగతాయారు, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఆస్తిపన్ను బకాయిలను ఈనెల 31లోపు చెల్లిస్తే వడ్డీపై 90శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సూచించారు. ఆస్తిపన్నును జీహెచ్ఎంసీ పోర్టల్, మైక్యూర్ యాప్, మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లలో సులభంగా చెల్లించవచ్చని తెలిపారు. ఇప్పటికే ఎఫ్ఎం రేడియోలు, బస్ షెల్టర్ల ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిల చెల్లింపులు, ఓటీఎస్‌పై విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

