Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్ సర్కార్‌పై పొంగులేటి అబద్దాలు.. స్టేజీపైనే కౌశిక్ రెడ్డి ఫైర్.. వీడియో
Ponguleti Srinivas Reddy | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నన్నీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీంతో పక్కన ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలగజేసుకొని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై మండిపడ్డారు.
Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్ సర్కార్ అలవికాని హామీలిచ్చి అమలు చేయలేక గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలమెల్లదీస్తుందని ప్రత్యేకించి చెప్పనసరం లేదు. కాంగ్రెస్ సర్కార్ పనితీరు ఎలా ఉందో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ మరోసారి చెప్పకనే చెబుతున్నాయి. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం తరపున ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నన్నీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీరుతామని అన్నారు. దీంతో పక్కన ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలగజేసుకొని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని పొంగులేటితో సభా వేదికపైనే కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి
కేసీఆర్ చేసిన అప్పుల వల్ల పథకాలు ఇవ్వడంలేదని చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వెంటనే లేచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డ కౌశిక్ రెడ్డి
అప్పుల పేరుతో… pic.twitter.com/MTemFVK5S9
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026
Read Also :
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్‌సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

