Iron Tablets | ఐరన్ ట్యాబ్లెట్లను రోజూ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..
శరీర ఆరోగ్యానికి ఐరన్ ఎంతో అవసరం. ఐరన్ లోపం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెతత్తుతాయి. లోపం ఉన్నప్పుడు వైద్యులు ఐరన్ సప్లిమెంట్లను సూచిస్తారు. అయితే అవసరానికి మించి ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
Iron Tablets | శరీర ఆరోగ్యానికి ఐరన్ ఎంతో అవసరం. ఐరన్ లోపం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెతత్తుతాయి. లోపం ఉన్నప్పుడు వైద్యులు ఐరన్ సప్లిమెంట్లను సూచిస్తారు. అయితే అవసరానికి మించి ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే వైద్యుల సూచన మేరకు సరైన మోతాదులోనే వీటిని తీసుకోవడం ముఖ్యం. ఐరన్ సప్లిమెంట్లను అధికంగా తీసుకున్నప్పుడు కొన్ని సాధారణ దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ముఖ్యంగా దంతాలపై మరకలు పడడం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు, వికారం, వాంతులు వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. లిక్విడ్ రూపంలో ఉండే ఐరన్ సప్లిమెంట్లను నేరుగా తీసుకోవడం వల్ల దంతాలపై మరకలు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల వాటిని నీరు లేదా పండ్ల రసంలో కలిపి, స్ట్రా ద్వారా తీసుకోవడం వల్ల దంతాలతో నేరుగా సంబంధం ఉండడాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం..
ఐరన్ సప్లిమెంట్లు కొందరిలో పొట్టలో అసౌకర్యం, మలబద్ధకం, విరేచనాలు లేదా కడుపు నొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే ఆహారంతోపాటు లేదా భోజనానికి ముందు, తర్వాత సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. ఐరన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, నోటిలో లోహం రుచి వంటి సమస్యలు వస్తాయి. మోతాదును తగ్గించడం వల్ల ఈ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే సప్లిమెంట్ మోతాదును స్వయంగా మార్చకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. శరీరంలో ఐరన్ అధికంగా చేరితే రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా రక్తపోటు తగ్గడం, నాడి బలహీనంగా లేదా వేగంగా కొట్టుకోవడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కనిపిస్తాయి.
చర్మం రంగుల్లో మార్పులు..
ఐరన్ ను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల చర్మం, పెదవులు లేదా వేళ్ల చివర్ల రంగులో మార్పులు కనిపిస్తాయి. చర్మం రంగు కోల్పోవడం లేదా వేళ్ల చివర్లలో నీలిరంగు ఛాయ కనిపించడం ఐరన్ అధిక మోతాదుకు సంకేతంగా ఉంటుంది. పిల్లల విషయంలో ఐరన్ అధిక మోతాదు మరింత ప్రమాదకరంగా ఉంటుంది. అధికంగా ఐరన్ ను తీసుకోవడం వల్ల శరీరంలో జింక్ శోషణకు ఆటంకం కలుగుతుంది. జింక్ లోపం పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, జుట్టు రాలడం, ఆకలి తగ్గడం, చర్మ సంబంధిత సమస్యలు, విరేచనాలు వంటి ఇబ్బందులకు దారితీస్తుంది. అందువల్ల ఐరన్ సప్లిమెంట్లు తీసుకునేవారు జింక్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ఐరన్ సప్లిమెంట్లు తీసుకున్నప్పుడు మలం నలుపు లేదా బూడిద రంగులోకి మారడం కొంతవరకు సాధారణమే. అయితే మలం తారు మాదిరిగా నల్లగా కనిపించడం, అందులో రక్తపు చారలు కనిపించడం, కడుపులో తీవ్రమైన నొప్పి లేదా పుండ్ల వంటి లక్షణాలు ఉంటే అంతర్గత రక్తస్రావానికి సంకేతం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించడం అవసరం.
ఊపిరితిత్తుల్లో ద్రవం చేరే అవకాశం..
ఐరన్ అధికంగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పాలిపోయినట్లు కనిపించడం, అధికంగా చెమటలు పట్టడం, గురక వంటి లక్షణాలు కనిపిస్తాయి. పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆందోళన కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. శరీరానికి ఐరన్ అవసరమైనప్పటికీ, అవసరానికి మించి సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వయోజన పురుషులకు రోజుకు 8 మిల్లీగ్రాములు, వయోజన మహిళలకు 18 మిల్లీగ్రాములు, గర్భిణులకు 27 మిల్లీగ్రాములు, పిల్లలకు సుమారు 11 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం ఉంటుంది. అయితే వ్యక్తిగత అవసరాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఐరన్ సప్లిమెంట్లను తీసుకునే ముందు, మోతాదును నిర్ణయించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

