ఎర్రగడ్డ, ఫిబ్రవరి 7: కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్న ఏకైక యూనియన్ టీఆర్ఎస్కేవీ అని వాటర్‌వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. త్వరలో జలమండలి కార్మికుల యూనియన్‌కు చేపట్టనున్న ఎన్నికల నేపథ్యంలో ఎర్రగడ్డ సెక్షన్ ఆవరణలో సోమవారం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జలమండలి కార్మికులకు హెల్త్ కార్డులు రావటానికి టీఆర్ఎస్కేవీ ఎంతో కృషి చేసిన విషయం తెలిసిందేనన్నారు. పీఆర్సీ సహా పలు సమస్యలను పరిష్కరించటానికి చొరవ చూపిందని గుర్తు చేశారు.
మున్ముందు పలు సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే మన యూనియన్ ఎన్నికల గుర్తు నిచ్చెనకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు ఎండీ జహంగీర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్, జంగయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్లు మొగులయ్య, నర్సింహారెడ్డి , కృపాకర్‌రెడ్డి, సెక్షన్ లీడర్ వెంకటనారాయణ పాల్గొన్నారు.