హయత్‌నగర్, ఫిబ్రవరి 8: ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఆర్టీసీ ఉద్యోగులు పనిచేసే స్థలంలో తప్పనిసరిగా బూస్టర్ డోసు వేయించుకోవాలని రంగారెడ్డి జిల్లా ఇమ్యూనిటైజేషన్ అధికారి స్వర్ణకుమారి సూచించారు. మేడారం జాతరకు వెళ్లే ఆర్టీసీ ఉద్యోగులందరికీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఆదేశాల మేరకు హయత్‌నగర్ డిపో-1లో అబ్దుల్లాపూర్‌మెట్ పీహెచ్సీ సెంటర్ సహకారంతో వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మెడికల్ అధికారిణి డాక్టర్ శ్వేతతో కలిసి డీఐఓ స్వర్ణకుమారి వ్యాక్సినేషన్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ టి.రఘు, ఎస్టీఐ రమాదేవి, ఎంఎఫ్ శ్రీనివాస్, బలవంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, జంగయ్య, ఇస్మాయిల్, మైసా నరేశ్, మహిపాల్, యాదగిరి, రమేశ్, అబ్దుల్లాపూర్‌మెట్ పీహెచ్సీ సిబ్బంది గీత, వనిత, కవిత, నీలిమ, రజియా, సంతోషి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు టీకాలు వేయించుకోవాలి
15 సంవత్సరాలు నిండిన యువతీయువకులు, విద్యార్థులు తప్పకుండా కొవిడ్ టీకాలు వేయించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ హయత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్ తెలిపారు. మంగళవారం ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆదేశాల మేరకు హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చెన్నగోని శ్రీధర్‌గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు మొదటి విడుతలో కరోనా టీకా తీసుకున్నవారు గురువారం నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రెండో డోసు కూడా వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్వేత, ప్రిన్సిపాల్ శ్రీదేవి, టీఆర్ఎస్ యువజన విభాగం డివిజన్ అధ్యక్షుడు డ్యాగల రాకేశ్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.