కందుకూరు, ఫిబ్రవరి 8: పండ్లు, కూరగాయలను పండించే రైతులు ఆర్థికంగా ఎదుగాలని రంగారెడ్డి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి డాక్టర్ సునందరెడ్డి తెలిపారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని సరస్వతిగూడ గ్రామంలో రైతుల ఉత్పత్తి, కంపెనీలు, మామిడి వేసవిలో కూరగాయాల పంటల సాగు, యాజమాన్య పద్ధతులు, పండ్ల తోటల్లో పండు ఈగ, నివారణ గురించి, పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రుమంలో పాల్గొని మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు రైతులు పాటించి యాజమాన్య పద్ధతులతో పంటలను సాగు చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలని కోరారు. ప్రభుత్వ అందజేసే సబ్సిడీలను వినయోగంచుకోవాలని సర్పంచ్ బూసరమోని రాము తెలిపారు. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, పరికారాలను అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ బూసరమోని రాము, ఎంపీటీసీ యాదయ్య, కృష్ణ, శశిధర్, ఏడీహెచ్ సంజయ్‌కుమార్, ఉద్యానవనశాఖ అధికారులు సౌమ్య, అశోక్, కందుకూరు, మహేశ్వరం మండలాల మామిడి. కూరగాయాలు పండించే రైతులు అధికారులు, పాల్గొన్నారు.