శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 8: శంషాబాద్ మం డలం నర్కూడ అమ్మపల్లి ఆలయంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మపల్లి ఆలయం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మాసకల్యాణంతో పాటు వార్షికోత్సవం, బ్రహ్మోత్సవాలు నిర్వహించడంతో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు.
ఆలయ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు ఆలయ మరమ్మతులు చేయడం కోసం దాతలు సహకారం అందించాలని సూచించారు. ఆలయ చైర్మన్ వినోద్‌బాబు, ఈవో శ్రీనివాస్, సర్పంచ్ సిద్ధులు, నీరటి రాజుముదిరాజ్, చంద్రారెడ్డి, బుక్క వేణుగోపాల్,కుమార్ యాదవ్, సతీశ్, శివాజీ, ధర్మకర్తలు శ్రీనివాస్, లావణ్యవిశ్వనాథం, అశోక్, కృష్ణ, మహేశ్, కౌన్సిలర్ మేకల వెంకటేశ్, మోహన్‌నాయక్,శ్రీకాంత్‌గౌడ్, యాదగిరి,పారేపల్లి శ్రీనివాస్‌గౌడ్, సత్తయ్య, భిక్షపతి, సత్యానందం, శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.