కందుకూరు, ఫిబ్రవరి 8 : మండలం పరిధిలోని గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వర దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం గురువారం నుంచి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీలక్ష్మీ గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి, ఉత్సహ విగ్రహాది పరివార దేవతా ప్రతిష్ఠ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. 14వ తేదీ ఉదయం 8 గంటల 31నిమిషాలకు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొంటారని తెలిపారు.
గురువారం నుంచి విగ్రహ ప్రతిష్ఠ పూజలు మొదలై 14వ తేదీ ఉదయం 5గంటలకు వేదారంభం, ఆచార్య సుత్తి, యాగశాల కైంకర్యములు, ప్రధాన కుంభారాధనం, 7 గంటలకు మహాపుర్ణాహుతి, 8 గంటలకు యంత్ర స్థాపనం, 8.30 నిమిషాలకు సముహూర్తం విగ్రహ స్థాపన, 9.30 నిమిషాలకు ప్రథమ దర్శనం, గోదర్శనం, ప్రథమ అర్చనం, యజమాన మహదాశీర్వచనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలి కోరారు.