బోనకల్లు మండలం వైరా- జగ్గయ్యపేట ప్రధాన రోడ్డు మార్గంలోని రావినూతల - జానకిపురం గ్రామాల మధ్య శనివారం భారీ మర్రి చెట్టు రోడ్డుపై కూలింది. ఎన్నో ఏళ్లుగా పెద్ద పెద్ద ఊడలతో ఉన్న మర్రిచెట్టు ఒక్కసారిగా రోడ్డు�
తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, చెరువులు, మున్నేరులు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. బోనకల్లు మండలంలోని పెద్ద బీరవల్లి గ్రామ సమీపంలో గల పెద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప
డోర్నకల్ జంక్షన్ నుండి భద్రాచలం రోడ్డు వరకు గతంలో రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులతో చర్చిస్తానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్�
గుండెపోటుతో మృతి చెందిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జడల వెంకటేశ్వర్లు పార్థీవ దేహాన్ని శుక్రవారం పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సందర్శ
మధిర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిబద్దలతో కృషిచేస్తున్న తాసీల్దార్ రాచబండి రాంబాబు ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు.
చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు ప్రమాదవశాత్తు మున్నేరులో పడి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసింది.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న భూక్య సురేశ్ ఉత్తమ అవార్డును అందుకున్నారు.
వరద నీటితో బోనకల్లు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం చెరువును తలపిస్తున్నది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఎటువంటి అవకాశం లేకపోవడంతో విద్యాలయ ఆవరణంలోనే నిలిచి చెరువును తలపిస్తుంది.
సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ నిర్ణయంపై కారేపల్లి సోసైటీ పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ�
విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు చేస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా నాయకులు సాయి, ఆకాశ్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఏఐఎస్�
మాదక ద్రవ్యాల నియంత్రణ అందరి బాధ్యత అని మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి.జయదాస్ అన్నారు. బుధవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం- సాధికారత శాఖ వారి ఆదేశానుసారం నాశ ముక్త భ�
తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధిర సీఐ మధు అన్నారు. బుధవారం మధిర సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.