Karepally : ఆర్ఎంపీ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
ఆర్ఎంపీ వైద్యుడి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకాయలపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
కారేపల్లి, నవంబర్ 14 : ఆర్ఎంపీ వైద్యుడి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకాయలపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేలకాయలపల్లి గ్రామానికి చెందిన జరుపల సందీప్తి (20) ఆ పరిసర గ్రామాల్లో ఆర్ఎంపి వైద్యుడిగా పనిచేసే నామ నరేశ్ గత కొంతకాలంగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆమెను కళాశాలకు పంపకుండా ఇంటి వద్దే ఉంచారు. భయంతో ఆర్ఎంపీ వైద్యుడు పరారై అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కాగా తల్లిదండ్రులకు భయపడకుండా తనను పెళ్లి చేసుకోవాలని సందీప్తిని ఆర్ఎంపీ అడగగా ఆమె నిరాకరించింది.
దీంతో ఇద్దరు కలిసి చనువుగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలను ఆర్ఎంపీ వైద్యుడు నరేశ్ తన స్టేటస్ గా పెట్టుకోవడమే కాకుండా ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో తన తల్లిదండ్రులతో కలిసి యువతి ఈ నెల 6వ తేదీన కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఆర్ఎంపీపై ఫిర్యాదు చేసింది. ఫొటోలు ప్రచారం చేయడం వల్ల తన, తమ కుటుంబం పరువు పోయిందని భావించి ఈ నెల 13న ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

