కారేపల్లి, నవంబర్ 17 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభను కనబరిచింది. ఎస్జీఎఫ్ అండర్-19 నెట్ బాల్ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థిని ప్రవళిక రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. పాఠశాల ప్రిన్సిపాల్ ఇలియాట్ ప్రేమ్ కుమార్, అధ్యాపక బృందం సోమవారం విద్యార్థినిని అభినందించారు.