PM Modi : దేశంలోనే మొదటి ‘రింగ్ మెట్రో’ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో ప్రారంభించారు. ‘రింగ్ మెట్రో’తో కలిపి ఢిల్లీ మెట్రోకు సంబంధించి రెండు కొత్త కారిడార్లను మోదీ లాంఛ్ చేశారు. 12.3 కిలోమటర్ల పొడవు కలిగిన మజ్లిస్ పార్క్-మౌజ్‌పూర్-బాబర్పూర్ (పింక్‌లైన్), 9.9 కిలోమీటర్ల దూరం కలిగిన దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ (మజెంటా లైన్) కారిడార్లను మోదీ ప్రారంభించారు.
పింక్‌లైన్ కారిడార్‌లో ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లున్నాయి. దీంతో ఈ పింక్లైనర్ మొత్తం 71.56 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. దీంతో ఈ మెట్రో పూర్తిస్థాయిలో కలిపి ‘రింగ్ మెట్రో’ అంటారు. ఈ మార్గంలో యమునా నదిపై బ్రిడ్జి కూడా ఉంది. అలాగే డబుల్ డెక్కర్ బ్రిడ్జి కూడా ఉంది. ఇందులో ఒక దాంట్లో మెట్రో లైన్ ఉంటే, ఇంకోదాంట్లో రోడ్ ఫ్లైఓవర్ ఉంది. కొత్తగా ప్రారంభమైన మజెంటా లైన్లో మరో ఏడు స్టేషన్లు చేరనున్నాయి. ఈ కారిడార్ మొత్తం పొడవు 49 కిలోమీటర్లు. దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ కారిడార్ 28.36 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇది ఢిల్లీ మెట్రో స్టేషన్లలోనే అత్యంత ఎత్తైనది. వీటితోపాటు మరో మూడు కొత్త కారిడార్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
గోల్డెన్ లైన్, గోల్డెన్ లైన్ ఎక్స్టెన్షన్, సెంట్రల్ విస్టా అనే మూడు కారిడార్ల నిర్మాణాన్ని మోదీ ప్రారంభించారు. వీటివల్ల నోయిడా ప్రజలు నేరుగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకునే వీలుంటుంది.