marriage bureau | 9 ఏళ్లైనా పెళ్లి కాలేదు.. వ్యక్తికి పరిహారం చెల్లించాలని మ్యారేజ్బ్యూరోకు ఆదేశం
marriage bureau | పెళ్లి సంబంధం కోసం ఒక వ్యక్తి మ్యారేజ్ బ్యూరోలో పేరు నమోదు చేసుకున్నాడు. అయితే 9 ఏళ్లు గడిచినా అతడికి సంబంధం కుదరకపోవడంతో పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో నష్టపరిహారం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
తిరువనంతపురం: పెళ్లి సంబంధం కోసం ఒక వ్యక్తి మ్యారేజ్ బ్యూరోలో పేరు నమోదు చేసుకున్నాడు. అయితే 9 ఏళ్లు గడిచినా అతడికి సంబంధం కుదరకపోవడంతో పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో నష్టపరిహారం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. (marriage bureau) కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కన్నూర్‌కు చెందిన నర్సింగ్ కాలేజీ ప్రొఫెసర్ 2016 నవంబర్‌లో శ్రీచక్ర మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాడు. పెళ్లి సంబంధం కోసం రూ.3,000 ఫీజు చెల్లించాడు. కాసరగోడ్‌కు చెందిన అమ్మాయితో పెళ్లి సంబంధం కుదుర్చుతామని ఆ మ్యారేజ్ బ్యూరో హామీ ఇచ్చింది.
కాగా, 9 ఏళ్లు గడిచినప్పటికీ ఆ ప్రొఫెసర్‌కు తగిన పెళ్లి సంబంధాన్ని కుదర్చడంలో ఆ మ్యారేజ్ బ్యూరో విఫలమైంది. ఆయన రిజిస్టర్ ప్రొఫైల్ యాక్టివ్‌లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయింది. తగిన సంబంధం వస్తుందని పదే పదే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి వృద్ధ తల్లిదండ్రులు అతడి పెళ్లి కోసం చాలా కాలం ఎదురు చూశారు. 2025 అక్టోబర్‌లో ఆయన తండ్రి క్యాన్సర్‌తో మరణించగా, అనారోగ్యంతో ఉన్న తల్లి అతడి పెళ్లి కోసం ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నది.
మరోవైపు 9 ఏళ్లుగా తనకు పెళ్లి కాకపోవడంతో ఆ ప్రొఫెసర్ మానసిక వేదనకు గురయ్యాడు. పెళ్లి సంబంధం కుదర్చడంలో విఫలమైన ఆ మ్యారేజ్ బ్యూరోపై వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. తనకు రూ.15,000 నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.
అయితే వినియోగదారుల కమిషన్ జారీ చేసిన నోటీసులకు మ్యారేజ్ బ్యూరో యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఈ కేసుపై ఏకపక్షంగా వ్యవహరించింది. సేవా లోపం ఉన్నట్లు నిర్ధారించింది. రూ. 3,000 రిజిస్ట్రేషన్ రుసుము తిరిగి ఇవ్వాలని, మానసిక వేదనకు పరిహారంగా రూ. 3,000, న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం రూ. 2,000 చెల్లించాలని ఆదేశించింది.
అలాగే ఈ ఉత్తర్వు అందిన 30 రోజులలోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. విఫలమైతే రూ.3,000 చెల్లించే వరకు ఏడాదికి 9 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఆ మ్యారేజ్ బ్యూరో ఈ ఆదేశాలను అమలు చేయని పక్షంలో, వినియోగదారుల రక్షణ చట్టం కింద తదుపరి చట్టపరమైన పరిష్కారాన్ని కోరే వెసులుబాటును కూడా ఫిర్యాదుదారుడికి కల్పించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

