రంగారెడ్డి : జిల్లాలోని కొత్తూరు గ్రామంలో రాత్రి పాముకాటు (Snakebite) తో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలం తేటిపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల రవి జీవనోపాధి కోసం కొత్తూరులో స్థలం లీజుకు తీసుకుని బ్రిక్స్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. రాత్రి భోజనం అనంతరం భార్య అనిత, పెద్ద కుమార్తె జెస్సి, చిన్న కుమార్తె హరిణి కలిసి నిద్రించారు.
అర్ధరాత్రి చిన్నారి హరిణి ( Harini ) కుడి తొడపై ఏదో కరిచినట్లు బాధతో ఏడవడంతో కుటుంబ సభ్యులు నిద్రలేచి పరిశీలించారు. ఇంట్లో కట్లపాము కనిపించడంతో, చిన్నారి కుడి తొడపై పాము కాటు గుర్తులు ఉన్నట్లు గుర్తించి చిన్నారిని చికిత్స నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. చిన్నారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.