నగోయా: వూషూ అథ్లెట్ రోషిబినా దేవి(Roshibina Devi) మళ్లీ మెరిసింది. ఆసియా క్రీడల్లో హ్యాట్రిక్ కొట్టింది. నగోయా గేమ్స్‌లో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకున్నది. వాస్తవానికి ఈ టోర్నమెంట్ కోసం ఆమెను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. సెలెక్షన్ ట్రయల్స్ సమయంలో యువ అథ్లెట్ దివ్యాన్ష్ చౌదరీ చేతిలో రోషిబినా ఓటమి పాలైంది. కానీ దివ్యాన్షి గాయపడడంతో రోషిబినాకు మళ్లీ అవకాశం కల్పించారు. 60 కేజీల సాండా ఈవెంట్లో పాల్గొన్న రోషిబినా 0-2 తేడా స్కోరుతో చైనా ప్రత్యర్థి జాంగ్జ్ జియావో చేతిలో ఫైనల్లో పరాజయాన్ని చవిచూసింది. రోషిబిని తనను వేధించినట్లు భారత బృందంలో చోటు కోల్పోయిన దివ్యాన్షి ఆరోపించింది.
మార్షియల్ ఆర్ట్స్ ఈవెంట్ వూషూలో 25 ఏళ్లు రోషిబినా పతకాన్ని చేజిక్కించుకోవడం ఇది మూడోసారి. 2018లో జకర్తాలో జరిగిన గేమ్స్‌లో కాంస్యం, 2023లో హోంగ్జూ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నది. వూషూ ఈవెంట్లో మెన్స్ 56 కేజీల విభాగంలో పోటీపడ్డ ఆర్యన్ క్వార్టర్స్‌లోనే ఓడాడు. వుమెన్స్ 52 కేజీలో అర్పన.. రౌండ్16లో ఓటమి పాలైంది. మెన్స్ 75 కేజీల ఓపెనింగ్ రౌండ్లోనే విక్రాంత్ బాలియన్ పరాజయం పొందాడు.