న్యూఢిల్లీ: బీహార్(Bihar)లో ఓ అమ్మాయిని లైంగికంగా వేధించిన ఘటన మరొకటి చోటుచేసుకున్నది. ఇటీవల జాముయిలో జరిగిన ఘటన తర్వాత తాజాగా సమస్తిపుర్లో జరిగిన సంఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ అబ్బాయితో కలిసి బైక్పై వెళ్తున్న అమ్మాయిని కొందరు యువకులు అడ్డుకున్నారు. రోడ్డుపై ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. ఆమె ప్రైవేటు శరీర భాగాలపై చేతులు వేసి వేధించారు. మాటలతోనూ ఆ అమ్మాయిని వెంటాడారు. సమస్తిపుర్లోని జగత్సింగ్పుర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
వీడియోను చూసిన వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోడ్డుపై ఫోటోలు దిగేందుకు అమ్మాయి, అబ్బాయిలు బైక్ను ఆపారని, ఆ సమయంలో స్థానిక యువకులు ఆమెపై అటాక్ చేసినట్లు తెలిసింది. ఈఘటనను సిరీయస్గా తీసుకున్న పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో ఉన్న వారిని గుర్తించిన తర్వాత వారిని అరెస్టు చేయనున్నట్లు పోలీసు ఆఫీసర్ అరవింద్ ప్రతాప్ సింగ్ తెలిపారు. కొన్ని రోజుల క్రితమే జాముయిలో ఇద్దరు పదో తరగతి విద్యార్థినులను వేధించిన విషయం తెలిసిందే.
సమస్తిపుర్ ఘటనకు చెందిన నలుగుర్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.
BIHAR IS NOT SAFE FOR GIRLS 🚨
After the Jamui incident, another disturbing video has surfaced, showing a girl is being harassed bys some boys in Samastipur, Bihar. pic.twitter.com/r1A01VdgC1
— Ritesh (@Ritesh_hisss) September 24, 2026