Omar Abdullah | సింధు నదీ జలాల ఒప్పందం రద్దు సబబే.. కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించిన జమ్మూ కాశ్మీర్ సీఎం.. పాక్పై మండిపాటు
Omar Abdullah : పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఉన్న సిందు నదీ జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమర్ధించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు చెప్పారు.
Omar Abdullah : పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఉన్న సిందు నదీ జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమర్ధించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో పాకిస్తాన్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ వల్ల మన రక్తమే ఎండిపోయిందన్నారు.
‘‘కాశ్మీర్ ప్రజల సంక్షేమం గురించి ఎప్పుడూ ముందుగా ఆలోచిస్తామని పాకిస్తాన్ తరచూ అంటూ ఉంటుంది. మరి నీళ్ల విషయంలో ఆ వైఖరి ఏమైంది..? మా నీళ్లను మేం వాడుకుంటున్నాం. ఇది తప్పా..? ఔను.. ఇది మా రక్తం (సింధు నదీ జలాలను గురించి). మా రక్తం ఇంకిపోయేలా చేసింది పాకిస్తాన్. ఈ నీళ్లు మావి. నదులు మావి. మా నదుల్ని, నీళ్లను వాడుకునే హక్కు మాకు ఉంది. కాశ్మీర్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నామని పాక్ చెబుతుంటుంది. మరి నీళ్ల అంశానికి వచ్చేసరికి వారి వైఖరి ఎందుకు మారింది..? మా నదుల నీళ్లను మేం వాడుకుంటుంటే తప్పేంటి? మా నీళ్లను పాక్ వాడుకునేటప్పుడు కాశ్మీర్ ప్రజలపై వారి ఆందోళన ఏమైంది..? ఇక్కడ మాకు ఆరు నదులున్నాయి. వాటిలో మూడు పంజాబ్ నుంచి ప్రవహిస్తాయి. వాటిని పూర్తిగా ఇండియానే వాడుకుంటుంది. మిగతా మూడింటిని పాకిస్తాన్కు ఇచ్చేశాం.
పాకిస్తాన్తో సింధు నదీ జలాల వల్ల మేం చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. చీనాబ్ నుంచి మేం తాగునీళ్లు కూడా తెచ్చుకోలేకపోయాం. తుల్బుల్పై బ్యారేజ్ కూడా కట్టలేకపోయాం. వ్యవసాయం కోసం జీలం నదిని కూడా వాడుకోలేకపోయాం. ఈ నదుల నీటిని నిల్వ చేయడానికి ఒక పెద్ద డ్యాం కూడా కట్టలేకపోయాం. అందుకే అది మా రక్తం. సింధు నదీ జలాల ఒప్పందం అందుకే రద్దైంది. ఈ ఒప్పందం ఇలాగే రద్దు కావాలి. అప్పుడే మనం మన నీటిని సరిగ్గా వాడుకోగలం’’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

