ముంబై: భారత పురుషుల జట్టు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్‌ను కొనసాగించాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని బీసీసీఐ సభ్యులు బోర్డు పెద్దలకు అప్పగించారు. వచ్చే నెల 4న అగార్కర్ పదవీకాలం ముగియనుంది. ముంబైలో శుక్రవారం జరిగిన బీసీసీఐ 95వ ఏజీఎంలో ఈ అంశంపై చర్చ జరుగగా అగార్కర్ భవితవ్యాన్ని ఆఫీస్ బేరర్లు తేల్చుతారని సమావేశం అనంతరం బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు.
దీంతో పాటు వచ్చే ఏడాది బీసీసీఐ వందేండ్ల పండుగ జరుపుకోబోతున్న సందర్భంగా ఏడాదిపాటు సంబురాలు నిర్వహించుకునే విధంగా చర్చలు సాగినట్టు సమాచారం. అంతేగాక వచ్చే ఏడాదికి ఐపీఎల్ కూడా 20 ఏండ్లు పూర్తిచేసుకోనుండగా ఈ రెండింటినీ ఘనంగా నిర్వహించేలా బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది.