President Of India : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పునస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi M) జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని, వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ పని చేయాలని ముర్ము సందేశమిచ్చారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఆమె ఆకాంక్షించారు. అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మనం గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.
తెల్లారితే ఎనభయో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో యవాత్ భారతావని పులకించనుంది. ఈ చరిత్రాత్మక రోజును పునస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించిన ఆమె.. న్యాయ వ్యవస్థను, చట్టసభలను మనం గౌరవించాలని ప్రజలకు సందేశమిచ్చారు. తాజాగా లోక్సభ్లో మొట్టమొదటిసారిగా ఆలపించిన వందేమాతరం గీతాన్ని పౌరులంతా గౌరవించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి కోరారు.
LIVE: President Droupadi Murmu’s address to the nation on the eve of the 80th Independence Day https://t.co/0EZ6TLdoM9
— President of India (@rashtrapatibhvn) August 14, 2026
తెల్లారితే ఎనభయో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో యవాత్ భారతావని పులకించనుంది. ఈ చరిత్రాత్మక రోజును పునస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించిన ఆమె.. న్యాయ వ్యవస్థను, చట్టసభలను మనం గౌరవించాలని ప్రజలకు సందేశమిచ్చారు.
‘మరికొన్ని గంటల్లో మనం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. దేశ ప్రజలతో పాటు విదేశాల్లోని భారతీయులు సైతం జెండా పండుగలో సగర్వంగా పాల్గొననున్నారు. మన మూడు రంగుల జెండా స్వాతంత్య్రానికి ప్రతీక. ఈ పతాకాన్ని మనం ఎంతో గౌరవంతో ఎగురవేస్తాం. 1947, ఆగస్టు15వ తేదీన బ్రిటీష్వారి కబంద హస్తాల నుంచి మన నేలకు స్వేచ్ఛ లభించింది. మనదేశంలోని విద్యార్థులు, టీచర్లు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అభివృద్ధి కోసం ఆతృతగా ఉన్నారు. అలానే వైద్యులు, వైద్యరంగంలోని సిబ్బంది ఆరోగ్య రంగంలో కృషి చేస్తున్నారు. రైతులు పంటలు పండించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగమవుతున్నారు. మిగతా రంగాల్లోని వారు సైతం రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను నిర్వర్తిస్తున్నారు. వారందరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఘనమైన వారసత్వ సంపద, స్వాతంత్య్ర పోరాటంలోని ఆశయాలనుంచి మనం ఆధునిక యుగంలో అడుగుపెట్టాం.
25 करोड़ से अधिक लोगों को गरीबी से मुक्ति दिलाने में सफलता मिली है। विश्व की सबसे बड़ी वित्तीय समावेश की योजना प्रधानमंत्री जन धन योजना के तहत लगभग 59 करोड़ खाताधारक बैंकिंग व्यवस्था से जुड़ चुके हैं। उनमें 32 करोड़ से अधिक महिला खाताधारक शामिल हैं। pic.twitter.com/68OwRdzUwI
— President of India (@rashtrapatibhvn) August 14, 2026
‘వయం రాష్ట్రీ జగ్రియమ్’ అనే వేదవాక్కు.. మనందరినీ దేశం పట్ల జాగరూకతతో ఉండడంలో స్ఫూర్తినిస్తుంది. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో ఎందరో పౌరులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. సామాజిక సంస్కరణలు, దేశం పట్ల ప్రేమకు సంబంధించిన విలువైన, ఆచరణీయమైన విషయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించారు. ఈ సందర్బంగా మన దేశ స్వాతంత్య్రం, పురోగతికి పాటుపడిన భారతావని బిడ్డలందరికీ నేను గౌరవ వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆగస్టు 14. ఈ రోజును విభజన భయానక దృశ్యాలను గుర్తుచేసుకునే రోజు. విభజన సమయంలో చెలరేగిన మతపరమైన హింస కారణంగా లక్షలాది మంది బలవంతంగా శరణార్ధులుగా మారారు. అయినా సరే ఇప్పటికీ వారు తమ గుర్తింపును మాత్రం వదులుకోలేదు.
हमारे देशवासी महात्मा ज्योतिबा फुले की 200वीं जयंती मना रहे हैं। महात्मा फुले और क्रांति-ज्योति सावित्रीबाई फुले ने सामाजिक न्याय, शिक्षा, महिला सशक्तीकरण और समानता के क्षेत्र में ऐतिहासिक योगदान दिया है। उनके आदर्शों के अनुसार विगत कुछ वर्षों के दौरान वंचित वर्गों को आगे बढ़ाने… pic.twitter.com/HH4cGsjZyJ
— President of India (@rashtrapatibhvn) August 14, 2026
ప్రజల ఆశయాలు చట్టసభల్లో తెలియజేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత. పౌరులు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించాల్సిన బాధ్యత చట్టాలను అమలు చేసేవాళ్లపై ఉంది. ఏ ఒక్కరు కూడా న్యాయానికి దూరమవ్వకుండా చూడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థలోని ప్రతి ఒక్కరిపై ఉంది. గత దశాబ్దంలో మన దేశం ఎంతో వేగంగా సమ్మిళిత వృద్ధిని సాధించింది. వారసత్వం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ దశాబ్దాల నాటి అడ్డంకులను తొలగించాం.
మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతిని నిర్వహించుకున్నాం. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత వంటి అంశాల్లో ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు చరిత్రాత్మకమైన కృషి చేశారు. వారి స్ఫూర్తితోనే అణగారిన వర్గాల అభివృద్ధికి ఈమధ్య ప్రాధాన్యం ఇస్తున్నాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం. ప్రధాన మంత్రి ధన్జన్ యోజన కింద.. దాదాపు 59 కోట్లమందికి బ్యాంకు ఖాతాలు తెరిపించాం. వీరిలో దాదాపు 32 కోట్ల మహిళలు ఉన్నారు. ఆహార భద్రత పథకం కింద 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నాం’ అని రాష్ట్రపతి ముర్ము జాతినుద్దేశించి చేసిన సుదీర్ఘ ప్రసంగంలో వెల్లడించారు.