Hannah Rapp : అమెరికా మహిళల బాక్సింగ్‌లో రాణిస్తున్న హన్నా రాప్(Hannah Rapp) దుర్మరణం చెందింది. జూలై 18, శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల హన్నా కన్నుమూసింది. టెక్సాస్‌లో సైకిల్ తొక్కుతుండగా ఓ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. దాంతో, తీవ్రంగా గాయపడిన హన్నా ప్రాణాలు కోల్పోయింది. బాక్సర్ మృతికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్రాజోస్ కౌంటీ షెరిఫ్స్ ఆఫీస్ కథనం ప్రకారం.. ఉదయం 10 గంటల సమయంలో సైక్లింగ్ చేస్తున్న హన్నా రాప్‌ను కారు ఢీకొట్టింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఇద్దరు సైక్లిస్టులను దాటి హన్నా సైకిల్‌ను తాకింది. ప్రమాదం తీవ్రతకు రక్తమోడిన బాక్సర్‌కు వెంటనే ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తీసకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ హన్నా ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Hannah Rapp dead at 26: US boxer killed with driver arrested and charged after reversing into her while cycling in Texas as Jake Paul leads tributes https://t.co/pRXzFtxwhZ
— Daily Mail Sport (@MailSport) July 19, 2026
అమెరికాలో మహిళల బాక్సింగ్‌లో సంచలనంగా మారిన హన్నా రాప్ మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. హన్నా అకాల మరణం పట్ల ప్రపంచ బాక్సింగ్ మండలి (WBC) అధ్యక్షుడు మౌరిసియో సులైమన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అమెరికా బాక్సింగ్‌లో హన్నా లోటును ఎవరూ పూడ్చలేరని పేర్కొన్నాడు. హన్నా అద్భుతమైన బక్సార్. అన్నికంటే ముఖ్యంగా.. తను మా బాక్సింగ్ కుటుంబంలో ఎంతో విలువైన సభ్యురాలు. ఆ విషాద సమయంలో హన్నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి బాధను పంచుకుంటాం అని సులైమన్ వెల్లడించాడు.
JAKE PAUL led tributes to boxing champion Hannah Rapp who suddenly died at the age of 26 following a tragic car accident. https://t.co/RKiCpGLT3I
— Irish Sun Sport (@IrishSunSport) July 19, 2026