Srinivas Goud | అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఎగువ రాష్ట్రాలను అడ్డుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud | కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవలసిన బాధ్యత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులపై ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
మహబూబ్ నగర్ : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను ( Illegal projects ) అడ్డుకోవలసిన బాధ్యత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులపై ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) వెల్లడించారు. జిల్లా ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాకు సాగునీరు దక్కకుండా చేసేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఆర్డీఎస్ ( RDS ) నుంచి అక్రమంగా నీరు తరలించేందుకు అనుమతి లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆల్మట్టి వద్ద 300 టీఎంసీల నీరు నిలుపుకునేందుకు ఎత్తును పెంచు తున్నారని, దీనిని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ కు నీళ్లు ఇవ్వవద్దని పని చేసిన ఆంధ్ర అధికారిని సలహాదారుగా నియమించిన ఆంధ్రకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని వివరించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్ట్ లను పూర్తి చేసుకోవడం తో పాటు చెరువులు నింపడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని అన్నారు. గతంలో రెండు లక్షల ఎకరాల సాగు ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో పది లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందని గుర్తు చేశారు. మహబూబ్ నగర్ లో 14 రోజులకు ఒకసారి తాగు నీళ్లు వచ్చేవని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు కృష్ణ నీటిని ఇంటింటికి అందజేశామని వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

