TASA | దక్షిణాఫ్రికాలో టాసా ఆధ్వర్యంలో ఘనంగా మండేలా దినోత్సవ సేవా కార్యక్రమాలు
TASA | నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
జోహన్నెస్‌బర్గ్: నెల్సన్ మండేలా ( Nelson Mandela ) జయంతి సందర్భంగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (TASA) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. టాసా సభ్యులు న్యూ జెరూసలేం ( New Jerusalem ) చిల్డ్రన్స్ హోమ్ సందర్శించి అనాథ ,నిరాశ్రయ చిన్నారులతో ఆప్యాయంగా గడిపారు.
ఈ సందర్భంగా టాసా ప్రతినిధులు చిన్నారులకు అవసరమైన ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, దుస్తులు , ఇతర ఉపయోగకరమైన వస్తువులను అందజేశారు. టాసా సభ్యుల కుటుంబసభ్యులు, పిల్లలు ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో పాల్గొని అనాథ పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపారు.

ఈ సందర్భంగా టాసా అధ్యక్షుడు మురళి బండారు ( Murali Bandaru ) మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా న్యూ జెరూసలేం చిల్డ్రన్స్ హోమ్‌కు టాసా తనవంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తుందని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్నారుల జీవితాల్లో ఆనందాన్ని నింపే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన భారత కాన్సులేట్ జనరల్ ఎస్ కొవేతన్ ( S. Koventhan) మాట్లాడుతూ టాసా సంస్థ గొప్పగా సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగిన విషయమని కొనియాడారు. తన తదుపరి పుట్టిన రోజు న్యూ జెరూసలేం చిల్డ్రన్స్ హోమ్ పిల్లలతో గడుపుతానని ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో తెలంగాణ సంస్కృతి పరిరక్షణతో పాటు సేవా కార్యక్రమాలకు నిర్వహించం పట్ల టాసాను పలువురు అభినందించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

