అలంపూర్, సెప్టెంబర్ 27 : వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పంటలు ఎండుతుంటే చూసి చలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మె ల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఉన్నతాధికారులతో మాట్లాడి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి సాగునీటిని విడుదల చేయించారు.
ఇరిగేషన్ అధికారులు ఆదివారం మోటర్లు ఆన్ చేసి నీటిని కాలువలకు మళ్లించారు. దీంతో జోగుళాంబ గద్వాల అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.