హత్య కేసులో వ్యక్తికి డబుల్ జీవిత ఖైదు
హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి డబుల్ జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కేసు వివరాలు. నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 27-08-2025 రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో దేవరకొండ రోడ్డులోని...
– నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు
నీలగిరి, నవంబర్ 20ర : హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి డబుల్ జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కేసు వివరాలు. నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 27-08-2025 రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో దేవరకొండ రోడ్డులోని ప్రతీక్ రెడ్డి మెమోరియల్ బాయ్స్ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ సమీపంలో నాంపల్లి మండలం, వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేశ్ (40) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి నిద్రించే స్థలం విషయంలో రమేశ్‌కు, కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాకు చెందిన షేక్ సిరాజ్ అలియాస్ సిల్లు (40)కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు షేక్ సిరాజ్, నిద్రిస్తున్న రమేశ్ తలపై బండరాయితో బలంగా కొట్టి హత్య చేశాడు.
ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేశారు. సీసీ టీవీ కెమెరాలో హత్య ఘటన నిక్షిప్తమై ఉండడంతో ఆ దృశ్యాలు సమగ్ర దర్యాప్తు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను కోర్టులో సమర్పించారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు షేక్ సిరాజ్ అలియాస్ సిల్లు (40)ను దోషిగా తేల్చుతూ బీఎన్ఎస్ సెక్షన్ 103(1) ప్రకారం హత్య నేరానికి జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం సెక్షన్ 3(2)(va) కింద జీవిత ఖైదుతో పాటు మరో రూ.5,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. రెండు జీవిత ఖైదు శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని న్యాయస్థానం పేర్కొంది.
ఈ కేసులో దర్యాప్తు నిర్వహించిన నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి, అప్పటి నల్లగొండ వన్ టౌన్ సీఐ ఎ. రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ జె. సైదులు పోలీస్ అధికారులుగా కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-1 ఎస్.శోభారాణి, డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, లైజన్ అధికారులు నరేందర్, మల్లికార్జున్ల కృషిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హత్య కేసులో వ్యక్తికి డబుల్ జీవిత ఖైదు
Land Dispute | కూతురి పెళ్లి కోసం రూ.25 వేల అప్పు.. 4.5 ఎకరాల భూమి కోల్పోయిన మహిళకు 30 ఏళ్ల తర్వాత న్యాయం!
వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Pneumonia | న్యుమోనియా అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ENE Repeat | బాక్సాఫీస్ వద్ద ‘ఈఎన్ఈ రిపీట్’ దూకుడు.. తొలి రోజే రూ.15 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

