అమరావతి: భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu) కు జరిగిన అవమానంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan) స్పందించారు. రాష్ట్రపతి పదవిని అవమానించేలా బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించడం బాధ కలిగించిందని ఎక్స్ వేదికలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఘటన విచారకరమని అన్నారు.
రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయని, దేశంలో ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ, మర్యాదలతో మెలగాలసి ఉంటుదని అన్నారు. భారతదేశంలో రాష్ట్రపతి పదవికి అత్యున్నత గౌరవాన్ని ఇవ్వాలని, రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేలా చూడడం సంబంధిత యంత్రాంగం బాధ్యత అని పవన్ కల్యాన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రొటోకాల్ కల్పించక పోవడంతో ఆయా పార్టీల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి .