Gouri Priya | చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన గౌరీ ప్రియా.. అమ్మ గుర్తొచ్చి కన్నీటి పర్యంతం
Gouri Priya | కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన తొలి రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.12 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరోయిన్ గౌరీ ప్రియా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయింది.
Gouri Priya | కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన తొలి రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.12 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరోయిన్ గౌరీ ప్రియా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయింది. సక్సెస్ మీట్లో గౌరీ ప్రియా మాట్లాడుతూ, సినిమా విడుదలైనప్పటి నుంచి తనకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల నుంచి వరుసగా అభినందనలు వస్తున్నాయని తెలిపింది. తన ఫోన్ నిరంతరం రింగ్ అవుతూనే ఉందని, ప్రేక్షకులు తన నటనను ప్రశంసించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.
అయితే ఈ సంతోష సమయంలోనే గౌరీ ప్రియా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. ఇటీవలే తన తల్లిని కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. “ఈ రోజు నా అమ్మ బతికి ఉండి ఉంటే ఎంత సంతోషపడేదో. నా జీవితంలో వచ్చిన ఈ అందమైన క్షణాన్ని, నటిగా నేను ఎదుగుతున్న తీరు ఆమె చూసి ఉంటే ఎంతో ఆనందించేది” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన విజయంలో తల్లి పాత్ర ఎంతో గొప్పదని, చిన్నప్పటి నుంచే తన కలలకు అండగా నిలిచిందని గౌరీ ప్రియా తెలిపింది. ప్రస్తుతం తనకు వస్తున్న ప్రతి ప్రశంసను తల్లికే అంకితం చేస్తున్నానని, ఆమె ఆశీస్సులు ఎప్పుడూ తనతోనే ఉంటాయని చెప్పడంతో సభలో ఉన్నవారంతా భావోద్వేగానికి గురయ్యారు.
ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’ విజయంతో కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాలో ఇద్దరి నటన, కెమిస్ట్రీకి ప్రశంసలు దక్కుతుండగా, ఈ విజయంతో చిత్రబృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది.ఇక హైదరాబాద్లోనే పుట్టి సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో విద్యనభ్యసించిన గౌరీ ప్రియ 2018లో ‘మిస్ హైదరాబాద్’ కిరీటం గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె, నటనతో పాటు సింగింగ్, డ్యాన్స్, పెయింటింగ్, ఫొటోగ్రఫీలతో కూడా సత్తా చాటింది. ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. చెన్నై లవ్ స్టోరీతో అందరి దృష్టిని ఆకర్షించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

