హుజూర్నగర్, జూలై 25 : హుజూర్నగర్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది కుక్కడపు బాలకృష్ణ గౌడ్ నియమితులయ్యారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సాముల రాంరెడ్డి శనివారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అంకితభావంతో పనిచేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రజలకు న్యాయ సేవలు అందించాలని సూచించారు. నూతనంగా నియమితులైన బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తనను హుజూర్నగర్ కోర్టుకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సాముల రాంరెడ్డి, హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారపరాజు శ్రీనివాసరావు, బార్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.