విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ఇందులో నటిస్తూ, కాండ్రేగుల నాయుడుతో కలిసి చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
అతిథులుగా విచ్చేసిన శివ నిర్వాణ, సాయిరాజేష్, ఆర్పీపట్నాయక్, లగడపాటిశ్రీధర్, రసూల్ ఎల్లోర్ చిత్రబృందానికి బెస్ట్ విషెస్ అందించారు. ‘అనకాపల్లి’ చిత్రంలో ప్రతి పాత్ర మధ్య పోటీ ఉంటుందని, ఒక్క సెకన్ కూడా డీవియేట్ అవ్వకుండా ఆడియన్స్ ఈ సినిమా చూస్తారని నిర్మాత, నటుడు త్రినాథరావు నక్కిన తెలిపారు. ఇంకా చిత్రబృందంతోపాటు మైత్రీ రవి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మాయా.వి, సంగీతం: దేవ్‌జండ్.