Balka Suman | క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ – సీపీఐ కూటమికి మెజార్టీ స్థానాలున్నా ఎన్నికలు జరకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. గత నెల 16, 17వ తేదీల్లో చైర్మన్ ఎన్నికల వాయిదా వేసేలా మంత్రి వివేక్ కుట్రలు పన్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు మాపై రాళ్ల దాడులు చేసినా ఉల్టా మాపైనే అక్రమ కేసులు పెట్టారని అన్నారు. మమ్మల్ని జైలుకు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షాసానందం పొందిందని పేర్కొన్నారు.
బెయిల్ వచ్చినా ప్రభుత్వ పెద్దల అండగా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును గౌరవిస్తూ రామకృష్ణాపురం పోలీస్ స్టేషన్కు హాజరయ్యామని తెలిపారు. మంత్రి వివేక్ చెన్నూరు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మూడు వారాల్లోపూ క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కక్ష పూరిత కేసుల నేపథ్యంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరవడం జరిగింది. pic.twitter.com/YzfeNShI3B
— Balka Suman (@balkasumantrs) March 8, 2026