హైదరాబాద్, ఆగస్టు6 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల అంచనాలతో ప్రాజెక్టు ఫీజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) సిద్ధమైంది. ప్రస్తు తం తొలి విడత ప్యాకేజీ-3 బరాజ్ నిర్మాణం, ప్యాకేజీ-5 పనులకు సంబంధించి అంచనాలను, డీపీఆర్, ప్రీఫిజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) తయారీకి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు ఆ పనులను దక్కించుకొన్న ఏజెన్సీ సంస్థ ఆర్వీ కన్సల్టెన్సీ పీఎఫ్ఆర్ను ప్రభుత్వానికి స మర్పించింది.
త్వరలోనే ఈ అంశంపై క్యాబినెట్లో చర్చిం చే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు 116 కి.మీ. ఉన్నది. ఆ పనులు గతంలో 5 ప్యాకేజీలుగా విభజించారు. అందులో ప్యాకేజీ-3 అనేది పూర్తిగా బరాజ్ నిర్మాణం. ప్యాకేజీ-1 అంటే 0-15 కి.మీ. కాలువ, ప్యాకేజీ-2లో 15-28.5 కి.మీ. కాలువు, ప్యాకేజీ-4లో 28.5 నుంచి 71.5 కి.మీ. ఉన్న మైలారం వరకు కాంక్రీట్ లైనింగ్ లేని కాలువ తవ్వ కం పనులు. అత్యంత కీలకమైంది ప్యాకేజీ-5 పనులు. ఇందులో మొత్తంలో 44.50 కి.మీ. నీటి సరఫరా వ్యవస్థ ను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. కానీ ప్రస్తుతం తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా సుందిళ్లకు జలాలను మళ్లించాలని నిర్ణయించారు. తద్వారా దూరం, ఆర్థికభారం తగ్గుతుందని ప్రభుత్వం చెప్తున్నది.