హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ) : ‘రాజకీయాల్లో విమర్శలకు ఒక హద్దూపద్దూ ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడి బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదు. నిరాధార ఆరోపణలు చేస్తే ఎవరైనా కోర్టుల చుట్టూ తిరుగాల్సిందే’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. తనపై క్షుద్రపూజల ఆరోపణలు చేసిన ముగ్గురు కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నాయకులు సామ రామ్మోహన్‌రెడ్డిలకు ఆయన తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు జారీ చేశారు.
నోటీసులకు స్పందించడానికి 30రోజుల గడువు విధించామని, అది ముగిసిన వెంటనే న్యాయస్థానంలో క్రిమినల్, సివిల్ డిఫమేషన్ సూట్లు(మాన నష్ట దావాలు) దాఖలు చేస్తామని గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో స్పష్టంచేశారు. తనపై ఆరోపణలు చేసిన ఎవరినీ వదిలిపెట్టబోనని ఈ సందర్భంగా హరీశ్‌రావు హెచ్చరించారు. గతంలో మంత్రి కొండా సురేఖ కూడా ఇష్టారీతిన మాట్లాడి, తమ నాయకులపై నిరాధారమైన ఆరోపణలు చేసి ఇప్పుడు నాంపల్లి కోర్టు చుట్టూ తిరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్‌రావు గుర్తుచేశారు.
ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్నందుకే కాంగ్రెస్ నేతలు తనను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే కోల్ మైనింగ్, నాదర్గుల్ భూముల కుంభకోణం, గురుకుల టెండర్లలో జరిగిన అవినీతి తాము బహిర్గ తం చేశామని చెప్పారు. అందుకే ముఖ్యమ ంత్రి రేవంత్‌రెడ్డి తెరవెనుక ఉండి తనపై నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని, కొం దరైతే సీఎం ప్రాపకం కోసం ఎంతకైనా తెగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని డైవర్షన్స్ చేసినా భయపడేది లేదని.. రైతులు, విద్యార్థులు, మహిళల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటానని హ రీశ్రా వు తేల్చిచెప్పారు. దేవాదులలో 10 మోటర్లు ఉంటే ప్రస్తుతం 4 మాత్రమే నడుస్తున్నాయ ని, మిగతావి పునరుద్ధరించడంలో ప్రభు త్వం విఫలమైందని మండిపడ్డారు.