‘ది ప్యారడైజ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని దక్కించుకున్న హీరో నాని తదుపరి సినిమా ‘బ్లడీ రోమియో’ కోసం సిద్ధమవుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో ైస్టెలిష్ గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం కథానాయిక అన్వేషణలో ఉన్న చిత్రబృందం పలువురు అగ్ర హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మీనాక్షి చౌదరి పేరు ప్రముఖంగా వినిపించింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ కథానాయికగా ఖరారైందని తెలిసింది.
దర్శకుడు సుజీత్ డిజైన్ చేసిన పాత్రకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుందని భావించిన మేకర్స్ ఆమె వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రీతి ముకుందన్. ఈ మధ్యకాలంలో బ్లాస్ట్, ఇదయం మురళీ వంటి తమిళ చిత్రాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్నది. ఒకవేళ ‘బ్లడీ రోమియో’లో ఆమె కథానాయికగా ఖరారైతే తెలుగులో ఈ భామ కెరీర్‌కు మరింత ఊపునిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.