మధిర, నవంబర్ 13 : మహాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాళోజి నారాయణరావు పాత్ర మరువలేనిదన్నారు. కాళోజీ జయంతిని రాష్ట్ర భాషా దినోత్సవంగా ప్రకటించుకోవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆయనను గౌరవించుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం, ఇక్కడి ప్రజల ఆకాంక్షల కోసం కాళోజీ కవితలు స్ఫూర్తిని అందించాయని, ఆయన రచనలు ఉద్యమానికి ఊపిరి పోశాయన్నారు.
మహాకవి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వైవి. అప్పారావు, ముత్తవరపు ప్యారి, ఎస్టీ ఇక్బాల్, ఆళ్ల నాగబాబు, బొగ్గుల వీరారెడ్డి (మాజీ సర్పంచ్), నాయకులు గంగవరపు రామకృష్ణ, కపిలవాయి జగన్, వేల్పుల శివ రమేశ్, చీదిరాలా రాంబాబు, అక్బర్, లంకె మల్ల నాగేశ్వరరావు, ఆవుల గోపి, దిల్ వంగవీటి, చాపల సొసైటీ ప్రెసిడెంట్ దర్శి నాగేశ్వరరావు, షకీల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.