ఖమ్మం రూరల్, నవంబర్ 17 : ఖమ్మం జిల్లా గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ ఎన్నిక సోమవారం జరిగింది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు తెల్లార్పల్లి గ్రామాల మధ్యలో గల మామిడి తోటలో అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంఘం ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా నునావత్ కిషన్, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే జానీ పాషా, ఉపాధ్యక్షుడిగా కత్రం శేషగిరి, కోశాధికారిగా ఆకుల సైదులు, ఎం.రామ్మూర్తి, సహాయ కార్యదర్శులుగా ఎం.నరసింహారావు, హనుమంతరావు, ఈసీ సభ్యులుగా శ్రీను, దిలీప్, శ్రీకాంత్, వెంకటేశ్, రమేశ్, అంజి, ఫయాజ్ ఖాన్, అలీమ్లను సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు వెంపటి ఉపేందర్, గౌరవ సలహాదారుడు నరేంద్ర తోపాటు అసోసియేషన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.