కాంగ్రెస్ కక్షసాధింపు
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనుసన్నల్లో బీ ఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతోంది. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ మారాలని.. లేకపోతే సంబంధంలేని విషయాల్లో కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. సోషల్ మీడియాలో భావ స్వేచ్ఛ ప్రకటన లేకుండా చేస్తున్నారు.
- దేవరకద్రలో అరాచక పర్వం
- బీఆర్ఎస్ పార్టీ నేతలే టార్గెట్‌గా..
- అధికార పార్టీలోకి రావాలని ఒత్తిడి
- అక్రమంగా కేసులు బనాయిస్తూ..
- ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇంటెలిజెన్స్
- అధికార పార్టీ నేతలా మారిన ఎస్సై
- రేవంత్ జిల్లాలో నిర్బంధకాండ
మహబూబ్‌నగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనుసన్నల్లో బీ ఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతోంది. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ మారాలని.. లేకపోతే సంబంధంలేని విషయాల్లో కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. సోషల్ మీడియాలో భావ స్వేచ్ఛ ప్రకటన లేకుండా చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేపై ఎవరై నా కామెంట్లు పెడితే వెంటనే పీఎస్ నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఎమ్మెల్యే చె ప్పిండు.. పార్టీ మారాలని.. లేకపోతే మీ ఇష్టం అంటూ.. ఓ ఎస్సై బెదిరింపులకు పాల్పడుతున్నారు. పార్టీ మారకుంటే ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 వేల ఓట్ల స్వల్ప తేడాతో తమ నేత ఓటమి పాలు కావడంతో ఆ నియోజకవర్గమం తా ఇప్పుడు కన్నీళ్లు పెడుతోంది. అధికార పార్టీ నాయకులు బెదిరించినా..? దాడులు చేసినా..? అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా పోలీసులను ఇండ్ల మీదకు పంపించినా గులాబీ పార్టీ శ్రేణులు మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి నేతలకు, కార్యకర్తలకు బాసటగా నిలుస్తూ ధైర్యం చెబుతున్నారు. ఏ ఘటన జరిగినా అక్కడికి వెళ్తూ వారిలో మనోధైర్యం నింపుతున్నారు. దేవరకద్రలో అరాచక పర్వంపై ప్రత్యేక కథనం..

బీఆర్ఎస్ నేతలే టార్గెట్
దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా రాజకీయం చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. మాట వినకుం టే అక్రమ కేసు నమో దు చేసి భయ
పెట్టడం ఇక్కడ పరిపాటిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? లేదంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపాలా? అని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో బీఆర్ఎస్ నేతలకు రక్షణ లేకుండా పో యింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతున్న అధికార పార్టీ దాష్టికాలను ధైర్యంగా ఎదుర్కొంటున్నా రు. నియోజకవర్గంలో అనేక మండలాల్లో ఇప్పటికే కేసులు న మోదు కాగా.. మరి కొందరిపై దాడి చేయడం.. పోలీస్ స్టేషన్ల కు పిలిపించి బెదిరించడం.. నిత్యకృత్యంగా మారింది. తమపై దాడి జరిగింది అని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు ఉల్టా కాంగ్రెస్ ఫిర్యాదులపై కేసులు పెట్టి చట్టా న్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎమ్మెల్యే గుప్పిట్లో ఇంటెలిజెన్స్
ఎమ్మెల్యే జీఎంఆర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ ఆయా మండలాల్లో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో ఏం జరుగుతుందో వెంటనే ఆయనకు చేరవేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కన్నా ఇంటెలిజెన్స్ వ్యవస్థపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని సమాచారం. పలానా గ్రామంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులను పార్టీలోకి తీసుకోవాలని.. వీళ్లు చెబితే క్షణాల్లో పోలీస్ అధికారుల నుంచి ఫోన్లు వెళ్తాయి. ఎమ్మెల్యే చెప్పిండు పార్టీ మారాలి.. లేకపోతే మీ ఇష్టం అంటూ.. నేరుగా వార్నింగ్‌లు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలోని ఓ ఎస్సై ఏకంగా పీఎస్‌ను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆ పీఎస్ పరిధిలోని అధికార పార్టీ నేతల ఫోన్లు చేస్తే క్షణాల్లో ఆ ఎస్సై రెస్పాండై బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు ముగ్గురిపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం గమనార్హం. భూత్పూర్ మండలంలో బీఆర్ఎస్ నేతపై దాడి జరిగితే కారణమైన కాంగ్రెస్ మండల నేతలపై తూతూ మంత్రంగా కేసు పెట్టినా నేటికీ అదుపులోకి తీసుకోలేదు. అడవి అజిలాపురానికి చెందిన హమాలీలను.. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతిస్తే ఓ హత్య కేసులో నిందితులుగా చేర్చుతామాని భయపెట్టారు. దీంతో అక్కడ సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి ఆ ఎస్సై పార్టీ కార్యకర్తలా మారడం విమర్శలకు తావిస్తోంది. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రెండేండ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులపై మూడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. సోషల్ మీడి యా పోస్టులు పెట్టిన వారికి ఫోన్ చేసి భయపెట్టడం ఆయన పనిగా పెట్టుకున్నారు.
ఎమ్మెల్యే అండదండలతో రెచ్చిపోతూ..
దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అండదండలతో నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనేకచోట్ల కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైంది. ఎమ్మెల్యే జీఎంఆర్ సొంత గ్రామంలో బీఆర్ఎస్ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడంతో ఆ పార్టీ పరువు పూర్తిగా పోయింది. ఆయా గ్రామాల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులను వేధించడం మొదలైంది. ఈ లోపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అక్కడక్కడ సత్తా చాటిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను టార్గెట్ చేసి పార్టీలో బలవంతంగా చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బెదిరించి నియోజకవర్గంలో అరాచక పర్వానికి తెర లేపుతున్నారు. పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ నేతలపై ఉపయోగిస్తూ చిన్న చిన్న వాటికి కేసులు పెడుతున్నారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఇంటలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా అనుకూలంగా మార్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా మండలాల్లో నియమించిన పోలీస్ యంత్రాంగం మొత్తం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనం.
అందరి లెక్కలు తేలుస్తాం..
ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి న్యాయవాద చదువును కేసులు పెట్టడానికి వాడుతున్నారు. ఏ సెక్షన్లు పెట్టాలో కూడా పోలీసులకు ఆయనే సూచిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి కేసులతో బీఆర్ఎస్ నాయకులకు వేధిస్తున్నారు. అప్పంపల్లి సర్పంచ్‌గా భారీ మెజారిటీ గెలవడం, కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడంతో అక్రమ కేసు పెట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలో వందకు పైగా అక్రమ కేసులు పెట్టి మా కార్యకర్తలు, నాయకులను జైలుకి పంపిస్తున్నారు. వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసినందుకు కూడా కేసులు పెడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను పార్టీ మార్పించే బాధ్యతను ఎమ్మెల్యే పోలీసులకు అప్పగించారు. బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకోండి…ఎవ్వరిని వదిలిపెట్టం… రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే…అందరి లెక్కలు తేలుస్తాం.. ఇప్పటికైనా కేసులు, వేధింపులు, బెదిరింపులు మానుకోండి..
– ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో బీఆర్ఎస్పై కేసులు
- దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు జట్టి నర్సింహారెడ్డి 20ఏండ్ల కిందట ప్లాటు అమ్మిన విషయంలో అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయించారు.
- భూత్పూర్ మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం చేయాలని మున్సిపాలిటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపినందుకు బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆయన శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేయించారు.
- మదనపూర్ మండలం వెంకటగిరి గ్రామ మాజీ సర్పంచ్ విజయ్‌పై కేసు నమోదు చేశారు.
- కౌకుంట్ల మండలం ఇశ్రంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శివరాజు, ఆయన అనుచరులు బోయరాజు, గొల్ల గోవిందులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయించడంతో శివరాజ్‌కు బెల్ మంజూరు కాగా గొల్ల గోవింద్, బోయ రాజు 15 రోజులు జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది.
- భూత్పూర్ మండలంలోని మద్దిగట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే బీఆర్ఎస్ పార్టీని గెలిపించినందుకు వెంకటేశ్ గౌడ్‌పై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డిలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. కేసు నమోదు చేసిన నిందితులను అరెస్టు చేయలేదు.
- భూత్పూర్ మండలంలోని పాత మొల్గర మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌పై అక్రమ కేసు నమోదు చేయించారు.
- కొత్తకోట మండలం నాటవెల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు నెహ్రూపై కేసు నమోదు చేశారు.
- మదనాపూర్ మండలం దుప్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ శివపై కేసు నమోదు.
- దేవరకద్ర మండలంలోని గూరకొండ మాజీ ఎంపీటీసీ గోపాల్‌పై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
- దేవరకద్ర మండలంలోని వెంకటంపల్లి ప్రతాప్‌పై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
- దేవరకద్ర మండలంలోని దద్దగూడెం మాజీ ఎంపీటీసీ శేఖర్‌ను ఎస్సై అక్రమంగా వేధిస్తూ ప్రతిరోజూ పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఇబ్బందులు పెడుతున్నారు.
- కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి గ్రామ సర్పంచ్ స్వర్ణలత భర్త మాజీ ఎంపీటీసీ మనోహర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించినందుకు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మాట్లాడిన సమయంలో జరిగిన చర్చలో మనోహర్ రెడ్డిపై హత్య కేసు నమోదు చేయించి జైలుకు పంపారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు నమోదైన కేసులు
- మదనపూర్ మండలం కొన్నూరు గ్రామానికి చెందిన రాముపై కేసు నమోదు చేశారు.
- భూత్పూర్ మండలం మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు
- అడ్డాకుల మండలంలోని పోనకల్ గ్రామానికి చెందిన జాజాల రాజేశ్వర్‌రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని పోలీస్‌స్టేషన్ లో నిర్బంధించి ఇబ్బంది పెట్టి మరోసారి పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి పంపించారు.
- చిన్నచింతకుంట మండలంలోని గూరకొండ గ్రామానికి చెందిన నర్సింహపై కేసు నమోదు చేశారు.
- మదనపూర్ మండలంలోని దుప్పల్లి శివపై కేసు నమోదు
- వనపర్తి జిల్లా మదనపూర్ మండలంలోని అజ్జకొల్లు గ్రామానికి చెందిన అశోక్‌పై కేసు నమోదు
- వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మదనా పూర్‌కు చెందిన ప్రవీణ్‌రెడ్డిపై కేసు నమోదు
- వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పామాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు గులాబీ గోవిందుపై అక్రమ కేసు నమోదు
- దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు కౌన్సిలర్ భర్త కొండలపై కేసు నమోదు
- దేవరకద్ర బీఆర్ఎస్ నాయకుడు అజీముద్దీన్పై అక్రమ కేసు నమోదు
- మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ మనోహర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

