Chennai Love Story | ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కిరణ్ అబ్బవరం మూవీ స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?
Chennai Love Story | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ లవ్ ఎంటర్టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ‘బేబీ’ సినిమాతో సక్సెస్ అందుకున్న సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Chennai Love Story | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ లవ్ ఎంటర్టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ‘బేబీ’ సినిమాతో సక్సెస్ అందుకున్న సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సుమారు రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో పాటు.. ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది.
ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆగస్టు 21 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అధికారిక స్ట్రీమింగ్ తేదీపై మేకర్స్ లేదా ఓటీటీ సంస్థ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, ఇప్పటికే చూసి మరోసారి సినిమా చూడాలనుకునేవారికి ఓటీటీ రిలీజ్ మంచి అవకాశంగా మారనుంది.
‘చెన్నై లవ్ స్టోరీ’ కథ విషయానికి వస్తే.. నివి అనే యువతి తన ప్రియుడు అజయ్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో అజయ్ తనకు మరో అమ్మాయి అంటే ఇష్టమని చెప్పి ఆమెతో విడిపోతాడు. ఊహించని బ్రేకప్‌తో నివి తీవ్రంగా కుంగిపోతుంది. ఆ బాధ నుంచి బయటపడేందుకు ఆమె స్నేహితులు నివిని చెన్నైకి తీసుకెళ్తారు. కానీ అక్కడ కూడా ఆమె తన గతాన్ని మర్చిపోలేకపోతుంది. క్రమంగా మద్యానికి బానిసగా మారుతుంది. అదే సమయంలో అనుకోకుండా ఆమె జీవితంలోకి స్టీవెన్ శంకర్ అనే యువకుడు వస్తాడు. అనాథ అయిన స్టీవెన్‌కు డైరెక్టర్ కావాలన్నది కల. నివి స్నేహితుల గ్యాంగ్ అతడికి ఆశ్రయం కల్పిస్తుంది. మొదట్లో స్టీవెన్ చేసే పనులు, అతడి ప్రవర్తన నివికి చిరాకు తెప్పిస్తాయి. అయితే కాలక్రమంలో స్టీవెన్ మాటలు, అతడి ఆలోచనా విధానం నివిలో మార్పు తీసుకొస్తాయి.
తన గత ప్రేమ వైఫల్యం నుంచి నెమ్మదిగా బయటపడిన నివి.. స్టీవెన్‌కు దగ్గరవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. అయితే అప్పుడే నివి గతం మరోసారి ఆమె ముందుకు వస్తుంది. అజయ్ మళ్లీ ఆమె జీవితంలోకి ఎందుకు వచ్చాడు? నివి, స్టీవెన్ల ప్రేమకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు నివి ఎవరిని పెళ్లి చేసుకుంది? అనే అంశాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటించారు. త్రిగుణ్, దేవీ ప్రసాద్, సిరి హన్మంతు, పి. వాసు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

