Priyanka Chopra | టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’లో మహేష్ సరసన నటిస్తున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు ‘వారణాసి’ సినిమాలోని ‘రుద్ర’ పాత్రకు సంబంధించిన ప్రత్యేక ఫొటోను షేర్ చేస్తూ ప్రియాంక చోప్రా ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. హాపీ బర్త్‌డే బాబ్. వారణాసితో కలిసి అల్టిమేట్ అడ్వెంచర్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి! అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ టైమ్-ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పవర్ఫుల్ రోల్లో అలరించనున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, వీరిద్దరి కాంబినేషన్‌పై వస్తున్న అప్డేట్స్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి.