Venkatesh | అనిల్ రావిపూడి క్రేజీ ప్లాన్.. వెంకీ-కళ్యాణ్ రామ్ చిత్రంలో క్రేజీ మాస్ సాంగ్!
Anil Ravipudi | టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Anil Ravipudi | టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. గతంలో ‘గుంటూరు కారం’ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన హౌస్ సెట్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలపై ఓ అదిరిపోయే సాంగ్‌ను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ మాస్ నంబర్‌కు అదిరిపోయే ట్యూన్ అందించారు.
ఈ భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్ క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్ కూడా భాగస్వామ్యం వహిస్తోంది. నవంబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

